యస్‌బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్‌ : షేరు పతనం | Yesbank Warned by RBI  for Disclosure of Nil Divergence Report  | Sakshi
Sakshi News home page

యస్‌బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్‌ : షేరు పతనం

Feb 18 2019 9:42 AM | Updated on Feb 18 2019 10:25 AM

Yesbank Warned by RBI  for Disclosure of Nil Divergence Report  - Sakshi

సాక్షి, ముంబై: మొండి బకాయిలు, ప్రొవిజనింగ్‌ అంశాలలో వివరాలను బహిర్గతం చేయడంపై ఆర్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో యస్‌ బ్యాంకు కౌంటర్‌లో ఇన్వెస్టర్ల  అమ్మకాలు వెల్లువెత్తాయి. డైవర్జెన్స్ నివేదికను వెల్లడి చేయడంపై గోప్యతా నిబంధన ఉల్లంఘన కింద చర‍్యలకు ఆర్‌బీఐ బ్యాంకును హెచ్చరించింది. ఆర్‌బీఐ యస్‌బ్యాంకుకు భారీగా జరిమానా విధించనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల  సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో ట్రేడింగ్‌ ఆరంభంలోనే దాదాపు 8 శాతానికి పైగా కుప్పకూలింది. ప్రస్తుతం స్వల్పంగా పుంజుకున్నా 3.5శాతం నష్టాలతో కొనసాగుతోంది.

మరోవైపు స్వల్ప లాభాలతో ప్రారంభమమైన స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. ఇన్వెస్లర్ల అమ్మకాలతో  సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 50 పాయింట్లకు  పైగా పతనమైంది. 

​కాగా మొండిబకాయిలు, ప్రొవిజనింగ్‌ అంశాలలో రిజర్వ్‌ బ్యాంకునుంచి క్లియరెన్స్‌ లభించిందని ఇటీవల మార్కెట్‌ రెగ్యులేటరీ సమాచారంలోయస్‌ బ్యాంకు వెల్లడించింది. గతేడాది(2017-18) ఆస్తుల(రుణాలు) క్లాసిఫికేషన్‌, ప్రొవిజనింగ్‌ వంటి అంశాలలో ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించిన అంశాన్ని ఆర్‌బీఐ ధృవీకరించిందని దీంతో ఆర్‌బీఐ నుంచి రిస్క్‌ అసెస్‌మెంట్‌ నివేదికను పొందినట్లు  ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement