5వేల ఉద్యోగాలకు ఎసరు | Vodafone-Idea merger: Combined Entity may lead to Layover of 5,000 employees-Report | Sakshi
Sakshi News home page

5వేల ఉద్యోగాలకు ఎసరు

Apr 16 2018 12:08 PM | Updated on Apr 16 2018 12:59 PM

Vodafone-Idea merger: Combined Entity may lead to Layover of 5,000 employees-Report  - Sakshi

సాక్షి,ముంబై: వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్  విలీనంతో దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతోంది. అయితే ఈ మెగా మెర్జర్‌ ఇరు సంస్థలకుచెందిన  ఉద్యోగులపై  వేటుకు దారి తీయనుంది.  వోడాఫోన్-ఐడియా విలీనం ద్వారా ఏర్పడనున్న ఉమ్మడి సంస్థలో భారీ తొలగింపులు చోటు చేసుకోనున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.   ఖర్చులను తగ్గించుకునేందుకు, సామర్థ్యాన్ని పెంచుకునే  వ్యూహంలో భాగంగా రాబోయే  నెలల్లో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకోవచ్చని నివేదించింది.  ఇరు సంస్థల్లో కలిపి 21వేల మందికి పైగా  ఉన్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు  5వేలమందిపై వేటుపడే అవకాశాలున్నాయని రిపోర్ట్‌ చేసింది.

‍ఉమ్మడి సంస్థ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే సందర్భంలో రుణాలు మార్జిన్ ఒత్తిళ్లతో అనవసర ఉద్యోగులను భరించాల్సిన అవసరం లేదని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్  వ్యాఖ్యానించడం ఈ అంచనాలకు ఊతమిచ్చింది. ముకేష్ అంబానీ యాజమాన్యం రిలయన్స్ జియో ప్రవేశం టెలికాం రంగాన్ని భారీగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో​ వోడాఫోన్‌, ఐడియా కంపనీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే ఐడియా, వోడాఫోన్‌   విలీనానికి ముందుకు వచ్చాయి.  జియో ఎఫ్టెక్ట్‌తో  కుదేలైన టెలికాం రంగం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను తగ్గించుకుంది. తాజాగా  మరో  5వేలమందికి ఉద్యోగులకు ఉద్వాసన తప‍్పదనే  వార్తలు వినిపిస్తున్నాయి

కాగా ఈ విలీన  ప్రక్రియకు ఎఫ్‌డీఐ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మెర్జర్‌కు ముందే ఇరు సంస‍్థలు (వోడాఫోన్‌, ఐడియా) తమ బకాయిలు క్లియర్ చేయవలసిందిగా టెలికాం శాఖ కోరినట్టు తెలుస్తోంది.  అలాగే  టెలికాం రంగంలో ఎఫ్‌డీల అనుమతి పై హోం మంత్రిత్వ శాఖ నుండి ఆమోదంకోసం ఎదురు చూస్తున్నట్టు  తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)కు  రెండు వారాల క్రితం పంపించామని , స్పందనకోసం వేచి ఉన్నామని టెలికాం విభాగం అధికారి తెలిపారు. కంపెనీలోఎఫ్‌డీఐఐ పరిమితిని 100 శాతం  పెంచాలని ఐడియా  కోరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement