ఎయిర్‌ఏసియాకు టాప్‌-లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై | Top-level exits: Five executives quit AirAsia India | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏసియాకు టాప్‌-లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లు గుడ్‌బై

Aug 25 2017 9:32 AM | Updated on Sep 12 2017 1:00 AM

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏసియా టాప్‌-లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణను భారీగా ఎదుర్కొంటుంది.

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏసియా టాప్‌-లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణను భారీగా ఎదుర్కొంటుంది. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మిట్టు ఛాండిల్య గతేడాది తన పదవి నుంచి తప్పుకున్నాక, ఇటీవల సీఎఫ్‌ఓ అరుణ్‌ ఖన్నాతో పాటు మరో ఐదుగురు కార్యవర్గ అధినేతలు తమ రాజీనామా పత్రాలను సమర్పించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వీరిలో మానవ వనరుల విభాగానికి చెందిన అధినేతకు రాజీనామా చేయాలని ఆదేశాలు వచ్చినట్టు ఈ విషయం తెలిసిన ఒక అధికారి చెప్పారు. మరో నలుగురిలో నవ్‌దీప్‌ లంబ(సెక్యురిటీ అధినేత), విధు నాయర్‌(ఆన్సిలరీ, కార్గో అధినేత), నంత కుమార్‌(ఇంజనీరింగ్‌ అధినేత), జీ సంపత్‌(ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌)లు ఉన్నారు. 
 
ఈ ఐదుగురిలో లంబ, నాయర్‌ ఈ విమానయాన సంస్థలో చేరిన ఆరు నెలల వ్యవధిలోనే ఎయిర్‌ఏసియాకు గుడ్‌బై చెప్పారు. దీనిపై స్పందించడానికి ఎయిర్‌ఏసియా ఇండియా అధికార ప్రతినిధి నిరాకరించారు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమర్‌ అబ్రోల్‌ కుడా కాల్స్‌కు, మెసేజ్‌లకు స్పందిచడం లేదు. ఎయిర్‌ఏసియా ఇండియా మానవ వనరుల విభాగానికి తర్వాత రాబోతున్న అధినేత, టాటా గ్రూప్‌ అధికారి అయి ఉండాడని మరో వ్యక్తి చెప్పారు. టాటా సన్స్‌కు, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏసియా బెర్హాడ్‌కు ఇది జాయింట్‌ వెంచర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement