ఎక్కడ సూచీలు అక్కడే.. | Top five factors keeping Sensex leashed below 28000 | Sakshi
Sakshi News home page

ఎక్కడ సూచీలు అక్కడే..

May 22 2015 1:47 AM | Updated on Sep 3 2017 2:27 AM

ఎక్కడ సూచీలు అక్కడే..

ఎక్కడ సూచీలు అక్కడే..

ఎస్‌బీఐ, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో...

* కొన్ని బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ
* నేడు ఎస్‌బీఐ, ఐటీసీల ఫలితాలు

ఎస్‌బీఐ, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో గురువారం స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. ఈ రెండు కంపెనీలు నేడు(శుక్రవారం) క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. రేట్ల కోత ఆశలు కొనసాగుతున్నప్పటికీ, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 27,809 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 8,421 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో కొన్ని బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగిందని అందుకే స్టాక్ మార్కెట్ సూచీలు అక్కడక్కడే కదలాడాయని ట్రేడర్లు చెప్పారు.
 లాభాల స్వీకరణ: అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం, దేశీయంగా ఎలాంటి ప్రధాన ఈవెంట్లు లేకపోవడంతో లాభాల స్వీకరణ జరిగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటై ల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. లాభాల స్వీకరణ, అమెరికాలో ముఖ్యమైన ఆర్థిక గణాం కాలు వెల్లడి కానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు అక్కడక్కడే కదలాడాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి వెల్లడించారు.
 
సెన్సెక్స్ అంచనాలు తగ్గింపు: సిటీ గ్రూప్
భారత మార్కెట్లపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతోందని సిటీ గ్రూప్ పేర్కొంది. అందుకే ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ టార్గెట్‌ను 33,000 పాయింట్ల నుంచి 32,200 పాయింట్లకు తగ్గిస్తున్నామని వివరించింది. 2016 జూన్ నాటికి సెన్సెక్స్ 35,000 పాయింట్లకు చేరుతుందని సిటీ గ్రూప్ అంచనా వేస్తోంది. ఇక నిఫ్టీ ఈ ఏడాది చివరకు 9.760కు, వచ్చే ఏడాది జూన్ కల్లా 10,600 పాయింట్లకు చేరుతుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement