నేటి అక్షయ తృతీయకు ఆభరణ సంస్థల ఆఫర్ల ఆహ్వానం 

Today Akshaya Tritiya is an invitation to jewelry companies - Sakshi

జోయాలుక్కాస్‌ ‘గోల్డ్‌ ఫార్ట్యూన్‌’! 
వరల్డ్‌ ఫేవరేట్‌ జ్యూయలర్‌ జోయాలుక్కాస్‌... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్డ్‌ఫార్ట్యూన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా బంగారం, డైమెండ్‌ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్‌ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్‌ జాయ్‌ అలూక్కాస్‌ పేర్కొన్నారు.  

ఒర్రా భారీ రాయితీలు... 
దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్‌చైన్స్‌లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్‌ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. పసిడి ఆభరణాల మేకింగ్‌ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్‌ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్‌ చార్జీలు ఉండవు. డైమెండ్‌ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది.  

మలబార్‌ గ్రూప్‌ ప్రత్యేక ఏర్పాట్లు... 
అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ ఆభరణాల సంస్థ– మలబార్‌ గ్రూప్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని,  భావిస్తున్నట్లు మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌  పేర్కొన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top