జూన్‌లో మౌలిక వృద్ధి 3 శాతమే.. | The basic growth of 3 percent in June | Sakshi
Sakshi News home page

జూన్‌లో మౌలిక వృద్ధి 3 శాతమే..

Aug 1 2015 12:55 AM | Updated on Oct 1 2018 6:45 PM

ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జూన్‌లో నిరాశను మిగిల్చింది

న్యూఢిల్లీ : ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జూన్‌లో నిరాశను మిగిల్చింది. 2014 జూన్‌లో జరిగిన ఉత్పత్తితో పోల్చి చూస్తే... కేవలం 3 శాతమే వృద్ధి నమోదయింది. అదే 2013తో పోల్చినపుడు 2014 జూన్‌లో ఈ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండటం గమనార్హం. గత నెల అంటే 2015 మేలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో 4.4 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా... జూన్‌లో 3 శాతానికే పరిమితమయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న పాలసీ సమీక్ష సందర్భంగా మరో దఫా రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.

వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాల పరిస్థితినీ వేర్వేరుగా చూస్తే... ఒక్క రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు మినహా మిగిలినవన్నీ నిరాశను కలిగించాయి. ఈ కీలక రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల(ఏప్రిల్-జూన్) వృద్ధి రేటును 2014 నాటి ఇదే కాలంతో పోలిస్తే 6% నుంచి 2.4 శాతానికి పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement