టాటా కెమికల్స్‌ యూరియా వ్యాపార విక్రయం పూర్తి | Sakshi
Sakshi News home page

టాటా కెమికల్స్‌ యూరియా వ్యాపార విక్రయం పూర్తి

Published Sat, Jan 13 2018 1:28 AM

Tata Chemicals urea completes business sale - Sakshi

న్యూఢిల్లీ: టాటా కెమికల్స్‌ కంపెనీ తన యూరియా, కస్టమైజ్‌డ్‌ ఫెర్టిలైజర్స్‌ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్‌ ఈ వ్యాపారాన్ని  నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్‌ ఎఎస్‌ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్‌ ఇండియాకు రూ. 2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బబ్రల ప్లాంట్‌ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్‌కు టాటా కెమికల్స్‌ అమ్మేసింది.

నియంత్రణలు అధికంగా ఉన్న యూరియా రంగంలో ఇది తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కావడం విశేషం. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ షరతులు, సూచనల ప్రకారమే ఈ వాటా విక్రయం పూర్తయినట్లు టాటా కెమికల్స్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. కాగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎరువుల మార్కెట్‌ అయిన భారత్‌లో ప్రవేశించడం ఉత్సాహాన్నిస్తోందని యారా ఇంటర్నేషనల్‌ సీఈఓ, ప్రెసిడెంట్‌  స్వీన్‌ టొరె హొల్‌సెథర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement