కన్సాలిడేషన్ నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 100 పాయింట్లు జంప్
Aug 23 2017 9:34 AM | Updated on Sep 12 2017 12:51 AM
సాక్షి, ముంబై : కన్సాలిడేషన్ నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా జంప్‌చేసి, 140.34 పాయింట్ల లాభంలో 31,432 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9800పైన 37.50 లాభంలో కొనసాగుతోంది. మార్కెట్లు పాజిటివ్ కొనసాగుతున్నందున్న నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పైకి ఎగిసింది. అటు ఆసియన్ మార్కెట్లు కూడా లాభాలతోనే ప్రారంభమయ్యాయి. రాజకీయ భౌగోళిక టెన్షన్లు తగ్గడంతో స్టాక్స్ బలపడుతున్నాయి.
అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల స్పందనలతో మన మార్కెట్లు కూడా లాభాల్లో నడుస్తున్నాయి. ఓపెనింగ్‌లో డీఎల్‌ఎఫ్ 4 శాతం, అదానీ పోర్ట్స్ 2 శాతం లాభపడింది.అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ నిన్నటి ట్రేడింగ్‌తో 0.05 బలపడి, 64.09 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 166 రూపాయల నష్టంలో 29,117 రూపాయలుగా ట్రేడవుతున్నాయి.
Advertisement
Advertisement