హెచ్చు తగ్గుల మధ్య ఊగిసలాట | Sensex Nifty Rise Paced By Gains In InfosysTCS | Sakshi
Sakshi News home page

 హెచ్చు తగ్గుల మధ్య ఊగిసలాట

Apr 5 2019 1:58 PM | Updated on Apr 5 2019 2:08 PM

Sensex Nifty Rise Paced By Gains In InfosysTCS - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఉత్సాహంగా  ట్రేడ్‌ అవుతున్నాయి. ఆరంభ డబుల్‌ సెంచరీ లాభాల నుంచి క్షీణించినా.. మళ్లీ  బాగా పుంజుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 135 పాయింట్ల లాభంతో 38,820 వద్దచ, నిఫ్టీ 52 పాయింట్లు బలపడి 11,650 వద్ద ట్రేడవుతోంది. అటు చైనాతో వాణిజ్య వివాదాల పరిష్కారానికి నెల రోజుల్లోగా డీల్‌ కుదిరే వీలున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌  వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, మెటల్‌, ఐటీ పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ శాతం క్షీణించాయి. సిప్లా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్, ఇన్ఫోసిస్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్, విప్రో లాభపడుతుండగా, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరో మోటో, యాక్సిస్‌, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. ప్రభుత్వ బ్యాంక్స్‌లో సిండికేట్‌, ఓబీసీ, పీఎన్‌బీ, అలహాబాద్‌, బీవోఐ, యూనియన్‌, సెంట్రల్‌, కెనరా కూడా నష్టాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement