నష్టాల ప్రారంభం

Sensex Nifty  Open Lower On Last Session Of 2019 - Sakshi

సాక్షి,ముంబై: 2019 ఏడాదికి ఆఖరి సెషన్‌ నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారి సెన్సెక్స్‌ 96 పాయింట్ల నష్టంతో 41459 వద్ద, నిఫ్టీ 28  పాయింట్లు బలహీనపడి 12227 వద్ద కొనసాగుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.

టెక్‌మహీంద్ర,జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌మోటార్స్‌ నష్టపోతున్నాయి. అటు యాక్సిస్‌ బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మ, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఐటీసీ పవర్‌గ్రిడ్‌ లాభపడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ  రూపాయి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సోమవారం నాటి ముగింపు 71.31 తో పోలిస్తే 5 పైసలు పుంజుకుని 71.26 వద్ద కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top