9 రోజుల ర్యాలీకి బ్రేక్‌ | Sensex, Nifty Close Lower, Banks Drag | Sakshi
Sakshi News home page

9 రోజుల ర్యాలీకి బ్రేక్‌

Apr 18 2018 3:56 PM | Updated on Nov 9 2018 5:30 PM

Sensex, Nifty Close Lower, Banks Drag - Sakshi

స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : గత 10 ట్రేడింగ్‌ సెషన్లలో మొదటిసారి దేశీయ ఈక్విటీ సూచీలు నష్టాలు పాలయ్యాయి. బ్యాంకులు దెబ్బ, చివరి అర్థగంటలో పెరిగిన అమ్మకాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కిందకి పడిపోయాయి. దీంతో 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 63 పాయింట్ల నష్టంలో 34,332 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో 10,526 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో ఐటీసీ, విప్రోలు అతిపెద్ద గెయినర్లుగా లాభాల పంట పండించాయి. 

యాక్సిస్‌ బ్యాంకు, టెక్‌ మహింద్రా, లుపిన్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, టైటాన్‌ కంపెనీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు 1 శాతం నుంచి 2.5 శాతం మధ్యలో నష్టాలు పాలయ్యాయి. వరుసగా తొమ్మిది రోజుల పాటు మార్కెట్లు లాభాలతోనే ముగుస్తూ వచ్చాయి. కానీ తొలిసారి మార్కెట్లు కిందకి పడిపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 1 శాతం వెనకడుగు వేయగా.. ఆటో, ఫార్మా 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా 1.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా, మెటల్‌, రియల్టీ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement