కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్‌ కుదేలు

 Sensex hits 15 mth low,ended at 1941 points  loss - Sakshi

15 నెలల కనిష్టానికి  స్టాక్‌మార్కెట్లు

ఇంట్రా డేలో సెన్సెక్స్‌ 2450 పాయింట్లు  నష్టం

 మార్కెట్‌ క్యాప్‌లో టాప్‌ ప్లేస్‌ కోల్పోయిన రిలయన్స్‌

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. కోవిడ్‌-19 (కరోనా  వైరస్‌) ఆందోళనకు తోడు, చమురు సంక్షోభం, స్టాక్‌మార్కెట్ల  పతనానికి మరింత తోడయ్యాయి.దీంతో  స్టాక్‌మార్కెట్‌ చరిత్రలోనే ఒక రోజులోనే ఇంత భారీ పతనం  నమోదుకాలేదు. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది.   బ్యాంకింగ్‌, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 1942 పాయింట్లు కుప్పకూలి  35643 వద్ద, నిఫ్టీ 538 పాయింట్ల పతనంతో 10451 వద్ద ముగిసాయి.  10451,  తద్వారా సెన్సెక్స్‌ 36వేల కీలక మద్దతు స్థాయికి దిగువన, నిఫ్టీ 10500 స్థాయికి దిగువన ముగిసింది.  యస్‌ బ్యాంకు, బీపీసీఎల్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌ మెటార్స్‌, ఐవోసీ, యూపీఎల్‌ మాత్రమే లాభపడ్డాయి.  చమురు షాక్‌తో ఓన్‌జీసీ, వేదాంతా, రిలయన్స్‌టాప్‌ లూజర్స్‌గా నిలవగా, వీటితోపాటు  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ బ్యాంకు, టాటా స్టీల్‌,  టాటా మోటార్స్‌, గెయిల్‌ భారీగా నష్టపోయాయి. 

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top