సెన్సెక్స్ కు ఐదో రోజు కూడా నష్టాలే! | Sensex falls for 5th day in a volatile trade | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు ఐదో రోజు కూడా నష్టాలే!

May 2 2014 5:42 PM | Updated on Sep 2 2017 6:50 AM

సెన్సెక్స్ కు ఐదో రోజు కూడా నష్టాలే!

సెన్సెక్స్ కు ఐదో రోజు కూడా నష్టాలే!

స్వల్ప ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఐదో రోజు నష్టాలతో ముగిసాయి

హైదరాబాద్: స్వల్ప ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఐదో రోజు నష్టాలతో ముగిసాయి. బ్లూచిప్ స్టాక్ లో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 22403 పాయింట్లతో, నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 6694 వద్ద ముగిసాయి. 
 
లాభాల స్వీకరణ, లోకసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 
 
టాటాపవర్, అంబుజా సిమెంట్స్, లుపిన్, బీపీసీఎల్, హెచ్ సీఎల్ టెక్ కంపెనీలు లాభాలతో ముగిసాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 6.37 శాతం నష్టపోగా, టాటా స్టీల్, సెసా స్టెరిలైట్, లార్సెన్, మారుతి సుజుకీ 2 శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement