న్యూ ఇయర్‌ బొనాంజా : ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ | SBI lowers base rate by 30 bps to 8.65% | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ బొనాంజా : ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

Jan 1 2018 2:48 PM | Updated on Jan 1 2018 2:48 PM

SBI lowers base rate by 30 bps to 8.65% - Sakshi

సాక్షి, ముంబయి: కొత్త ఏడాది ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ తీపికబురు అందించింది. బేస్‌ రేటు ప్రకారం లోన్లు పొందిన పాత కస్టమర్లకు ఊరట కల్పిస్తూ బేస్‌ రేటును 0.3 శాతం తగ్గించింది. దీంతో బేస్‌ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది.

తాజా తగ్గింపుతో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ బేస్‌ రేటు అతితక్కువ కావడం గమనార్హం. మిగిలిన బ్యాంకులూ ఎస్‌బీఐ బాటలో బేస్‌ రేటును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎస్‌బీఐ చర్యతో పలు కస్టమర్లకు భారీ ఊరట లభించనుంది. విద్యార్థులు, గృహ రుణాలు తీసుకున్న కస్టమర్లు తమ రుణాలపై బేస్‌ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లు ఉండటంతో తాజా తగ్గింపుతో వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement