రూ. 3640 కోట్ల ఎన్‌పీఏల వేలం 

SBI to Auction Rs 2,338 cr Worth NPAs on March 26 - Sakshi

మరోసారి నిరర్ధక ఆస్తులను వేలం వేస్తున్న ఎస్‌బీఐ

మార్చి 22, 26 తేదీల్లో వేలం

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా నిరర్ధక ఆస్తులను వేలం వేయనుంది. రూ.2,337.88 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.ఆరు ఖాతాలకు చెందిన నిరర్థక ఆస్తుల వేలాన్ని మార్చి 26న నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే 100 శాతం  క్యాష్‌ బేసిస్‌లో ఉంటుందని తెలిపింది. ఆమేరకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో  వేలం నోటీసును జారీ చేసింది.

ఇండియన్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ (రూ.939 కోట్లు) , జై బాలాజీ ఇండస్ట్రీస్‌ ( రూ.859 కోట్లు)  కొహినూర్‌ ప్లానెట్‌  ప్లానెట్ కన్స్ట్రక్షన్ (రూ. 207.77 కోట్లు), మిట్టల్ కార్పొరేషన్ (రూ.116.34 కోట్లు), ఎంసిఎల్ గ్లోబల్ స్టీల్ (రూ. 100.18 కోట్లు), శ్రీ వైష్ణవ్ ఇస్పాత్ (82.52 కోట్లు), గతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (42.86 కోట్లు) ఉన్నాయి. కాగా గతవారమే  రూ.1,307.27 కోట్ల నిరర్థక ఆస్తులను వేలం వేయనున్నట్టు వెల్లడించింది. ఈ వేలం 22న వేలం వేయనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించిన  సంగతి తెలిసిందే. దీంతో మొత్తం వేలం విలువ రూ.3640 కోట్లకు చేరింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top