గెలాక్సీ జే2, జే2 ప్రొ ధరలు తగ్గాయ్‌! | Samsung Galaxy J2 Pro Galaxy J2 (2017) Price in India Slashed | Sakshi
Sakshi News home page

గెలాక్సీ జే2, జే2 ప్రొ ధరలు తగ్గాయ్‌!

Feb 21 2018 3:11 PM | Updated on Jul 6 2019 3:18 PM

Samsung Galaxy J2 Pro Galaxy J2 (2017) Price in India Slashed - Sakshi

గెలాక్సీ జే2(2017) స్మార్ట్‌ఫోన్‌

శాంసంగ్‌ తన గెలాక్సీ ధరలను తగ్గించింది. గెలాక్సీ జే2 ప్రొ, గెలాక్సీ జే2(2017) స్మార్ట్‌ఫోన్లపై భారత్‌లో ధరలు తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. తగ్గింపు అనంతరం గెలాక్సీ జే2 ప్రొ 7,690 రూపాయలకు, గెలాక్సీ జే2(2017) 6,590 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ధరలు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైలర్స్‌లో అన్నింటిలో బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ చెప్పింది. కొత్త గెలాక్సీ జే2 ప్రొ ఇప్పటి వరకు ఈ-కామర్స్‌ సైట్లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లలో లిస్ట్‌ కాలేదు. గెలాక్సీ జే2(2017) మాత్రం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. గెలాక్సీ జే2 ప్రొ 2016 జూలైలో రూ.9,890కు లాంచ్‌ కాగ, గెలాక్సీ జే2((2017) గత అక్టోబర్‌లో రూ.7,390కు దేశీయ మార్కెట్‌లోకి వచ్చింది. 

దేశీయ సరమైన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌లో మార్కెట్‌ షేరును పొందడానికి శాంసంగ్‌కు ఈ కొత్త ధరలు సహకరిస్తాయని కంపెనీ చెప్పింది. చైనీస్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు షావోమి రెడ్‌మి వై1 లైట్‌, రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్ల నుంచి గెలాక్సీ జే2 ప్రొ, గెలాక్సీ జే2(2017)లకు గట్టి పోటీ వస్తోంది. 

శాంసంగ్‌ గెలాక్సీ జే2 ప్రొ స్పెషిఫికేషన్లు
ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో
5 అంగుళాల హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1.5 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
16జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గెలాక్సీ జే2(2017) స్పెషిఫికేషన్లు...
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌
4.7 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ఎక్సీనోస్‌ ప్రాసెసర్‌ 
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
5 ఎంపీ రియర్‌ కెమెరా
2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
2000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement