ట్యాబ్లెట్‌ పీసీల్లో శాంసంగ్‌ టాప్‌.. | Samsung Leads Indian Tablet PC Market Premium Segment Sees 7x Growth | Sakshi
Sakshi News home page

ట్యాబ్లెట్‌ పీసీల్లో శాంసంగ్‌ టాప్‌..

Mar 29 2026 7:37 AM | Updated on Mar 29 2026 7:40 AM

Samsung Leads Indian Tablet PC Market Premium Segment Sees 7x Growth

ముంబై: భారత ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్‌ 31% మార్కెట్‌ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్‌ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.

‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్‌ మార్కెట్‌లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్‌గా మారింది. ఈ విభాగంలో షిప్‌మెంట్‌లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్‌లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రధాన అనలిస్ట్‌ అన్షికా జైన్‌ తెలిపారు.  

కొనసాగిన శాంసంగ్‌ హవా: భారత్‌ ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌లో గతేడాది కూడా శాంసంగ్‌ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్‌ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ9 సిరీస్‌కు మంచి డిమాండ్‌ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్‌ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్‌ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ సిరీస్‌ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.  

యాపిల్‌ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్‌ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్‌ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్‌ (2025) 128జీబీ మోడల్‌కు మంచి డిమాండ్‌ ఉండటం గమనార్హం. ఐప్యాడ్‌ ప్రో సిరీస్‌లో ఓఎల్‌ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ స్థానం బలపడింది.   లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్‌మెంట్‌ పెరు గుదలతో 11% మార్కెట్‌ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్‌ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్‌ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది.  

ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్‌ ఎగుమతులు ఒక మిలియన్‌ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్‌ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్‌మెంట్‌లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్‌ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్‌ గ్లోబల్‌ ట్యాబ్లెట్‌ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.

2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్‌ ఆధారంగా 2026లో మార్కెట్‌ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్‌లు, ప్రొడక్టివిటీ డివైజ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్‌తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్‌లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్‌ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement