ఎస్బీఐలో భారీగా డిపాజిట్లు | Rs 53000 crore received in deposits after demonetisation move: SBI | Sakshi
Sakshi News home page

ఎస్బీఐలో భారీగా డిపాజిట్లు

Nov 12 2016 1:01 AM | Updated on Sep 4 2017 7:50 PM

ఎస్బీఐలో భారీగా డిపాజిట్లు

ఎస్బీఐలో భారీగా డిపాజిట్లు

కేంద్రం రూ.500, రూ.1,000 రూపాయల రద్దు చేసిన తరువాత ఇప్పటి వరకూ బ్యాంకులో రూ.53,000 కోట్లు డిపాజిట్ అరుునట్లు బ్యాంకింగ్ దిగ్గజం...

పెద్ద నోట్ల రద్దు తరువాత రూ.53,000 కోట్లు డిపాజిట్ అరుునట్లు ప్రకటన 

 ముంబై: కేంద్రం రూ.500, రూ.1,000 రూపాయల రద్దు చేసిన తరువాత ఇప్పటి వరకూ బ్యాంకులో రూ.53,000 కోట్లు డిపాజిట్ అరుునట్లు బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. అలాగే శుక్రవారం సాయంత్రానికి రూ.1,500 కోట్ల కరెన్సీ మార్పిడి జరిగినట్లు కూడా తెలిపింది. ఒక్క గురువారం ఈ విలువ రూ.723 కోట్లని పేర్కొంది.  ‘‘నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యాపార  కార్యకలాపాలు గణనీయంగా పెరిగారుు.

అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం’’ అని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అరుుతే బ్యాంక్ ఏటీఎంలు శుక్రవారానికి సగమే పనిచేస్తున్నట్లు కూడా తెలిపారు. 29,000 ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు (సీడీఎం) పనిచేస్తున్నట్లు వెల్లడించిన బ్యాంక్ చీఫ్, ఇందులో 21,000 ఏటీఎంలు, మిగిలినవి సీడీఎంలని వివరించారు. ఐదు అనుబంధ బ్యాంకులను కలుపుకుని ఎస్‌బీఐ గ్రూప్‌కు 55,000 ఏటీఎంలు ఉన్నారుు. 7,000 క్యాష్ డిపాజిట్ మిషన్లను సంస్థ నిర్వహిస్తోంది. బ్యాంక్ దాదాపు 17,000 బ్రాం చీలను కలిగివుంది. 3,000 పీఓఎస్‌లను నిర్వహిస్తోంది.  కాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్లు భారీగా పెరిగాయని గురువారం ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement