రోల్స్ రాయిస్ వెడ్డింగ్ కారు

సాక్షి , భోపాల్: అంగరంగ వైభవంగా రాయల్‌లుక్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే మధ్యతరగతి వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్. అందమైన, ఖరీదైన కారులో ఊరేగాలన్న వధూవరుల కోరికను తీర్చేందుకు ఓ వెడ్డింగ్ ప్లానర్ కృషి ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఖరీదైన రోల్స్ రాయిస్ కారును అందంగా పెళ్లి పల్లకిలా రీమోడల్ చేశారు.
మధ్య తరగతి జంటలకు వారి పెళ్లి రోజున రాయల్ ఫీలింగ్ కలిగించాలనే ఉద్దేశ్యంతో, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన హమీద్ ఖాన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్‌ను పెళ్లి ఊరేగింపునకు అనువుగా , అందంగా పునర్నిర్మించారు. పల్లకిని తలపించేలా సరికొత్తగా డిజైన్ చేశారు. మధ్యతరగతి వధూవరుల కలలకు ప్రాణం పోస్తూ కారును డిజైన్ చేసి..దానికి రాయల్స్ వెడ్డింగ్ కారుగా పేరు పెట్టారు. మధ్యతరగతి జంటలకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని రూపొంచినట్టు ఖాన్ తెలిపారు. ఇంకా ధర నిర్ణయించలేదన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి