సెల్‌కాన్ ‘క్యూ5కే’ రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ | Reverse charging smartphone | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ ‘క్యూ5కే’ రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్

Nov 19 2015 11:55 PM | Updated on Sep 3 2017 12:43 PM

సెల్‌కాన్ ‘క్యూ5కే’ రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్

సెల్‌కాన్ ‘క్యూ5కే’ రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సెల్‌కాన్ తాజాగా ‘క్యూ5కే ట్రాన్స్‌ఫార్మర్’ పేరుతో రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి

హైదరాబాద్: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సెల్‌కాన్ తాజాగా ‘క్యూ5కే ట్రాన్స్‌ఫార్మర్’ పేరుతో రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనికి 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. రివర్స్ చార్జింగ్ ఫీచర్‌తో ఈ ఫోన్ నుంచి మరో ఫోన్‌ను చార్జ్ చేసే వీలుండడం దీని ప్రత్యేకత. అలాగే ఇందులో 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యువీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, డ్యూయల్ ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటో ఫోకస్ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఓటీజీ, కస్టమైజేబుల్ స్మార్ట్ కమాండ్స్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, డ్యూయల్ సిమ్ తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్ ధర రూ.5,999. తమ సక్సెస్‌కు కొత్త ఆవిష్కరణలే ప్రధాన కారణమని, ఈ విషయాన్ని క్యూ5కే ట్రాన్స్‌ఫార్మర్ మరోసారి నిజం చేస్తుందని సెల్‌కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్‌ఫోన్లను అందుబాటు ధరల్లో సామాన్యులకు అందించడంలో సెల్‌కాన్ ఎప్పుడూ ముందుం టుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement