భార‌త్‌లో ట్రెండింగ్ యాప్‌ను తొల‌గించిన గూగుల్‌ | Sakshi
Sakshi News home page

రిమూవ్ చైనా యాప్స్ తొల‌గించిన గూగుల్‌

Published Wed, Jun 3 2020 3:19 PM

Remove China Apps Removed From Google Play Store - Sakshi

న్యూఢిల్లీ: స్వ‌దేశీ యాప్స్‌గా చెప్పుకుంటున్న వాటికి గూగుల్ వ‌రుస‌గా షాకిస్తోంది. ఇప్ప‌టికే టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్‌ను తొల‌గించిన విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త్‌లో ట్రెండింగ్ యాప్‌గా ఉన్న‌ "రిమూవ్ చైనా యాప్స్" అనే యాప్‌ను సైతం ప్లే స్టోర్ నుంచి తొల‌గించింది. గూగుల్ యాప్స్ పాల‌సీ నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన కార‌ణంగా దీన్ని తీసేసిన‌ట్లు పేర్కొంది. ఇక రిమూవ్ చైనా యాప్స్ విష‌యానికి వ‌స్తే.. అది ఏం చేస్తుంద‌నేది దాని పేరులోనే ఉంది. ఇది మ‌న ఫోన్‌లో ఉన్న చైనా యాప్‌ల‌ను గుర్తించి, వాటి స‌మాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్స్ ప‌క్క‌నే రెడ్ క‌ల‌ర్‌లో డిలీట్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దాన్ని సెల‌క్ట్ చేయ‌గానే స‌ద‌రు యాప్ అన్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్‌ను వ‌న్ ట‌చ్ యాప్ ల్యాబ్స్ అనే సంస్థ రూపొందించింది. 4.8 రేటింగ్‌తో దూసుకుపోయిన ఈ యాప్‌ను 5 మిలియ‌న్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. (ప్లే స్టోర్‌లో క‌నిపించ‌ని మిట్రాన్‌)

కాగా క‌రోనా కల్లోలానికి చైనానే కార‌ణ‌మంటూ అమెరికా స‌హా ప‌లు దేశాలు చైనాను వేలెత్తి చూపిస్తున్న విష‌యం తెలిసిందే. అటు క‌రోనా అంశంతోపాటు స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ కార‌ణంగా భార‌తీయుల్లోనూ చైనాపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో చైనా వ‌స్తువుల‌ను దూరం పెట్టాల‌న్న నినాదంతో పాటు, చైనా యాప్స్‌పై తిరుగుబాటు కూడా మొద‌లైంది. ఫ‌లితంగా టిక్‌టాక్ రేటింగ్స్ ప‌డిపోయాయి. దానికి పోటీగా వ‌చ్చిన మిట్రాన్ 5 మిలియ‌న్ల డౌన్‌లోడ్ల‌తో విశేషాద‌ర‌ణ పొందింది. కానీ అంత‌లోనే గూగుల్ టిక్‌టాక్‌కు పాత రేటింగ్‌నే కేటాయించ‌డం, మిట్రాన్‌ను తొల‌గించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. (గూగుల్‌ ప్లే స్టోర్‌లో డేంజరస్‌ యాప్స్‌ హల్‌చల్‌)

Advertisement
Advertisement