
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ క్వాంటెలా... దేశంలోని 9 నగరాలతో పాటు వివిధ దేశాల్లో 30 నగరాల్లో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగమయింది. స్మార్ట్ ఇన్‌ఫ్రా ఏర్పాటు చేసే కంపెనీలకు తాము సాంకేతిక సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ఫౌండర్ శ్రీధర్ గాధి శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు.
ఏడాదిలో భారత్‌లో మరో 15 నగరాలకు సేవలను విస్తరించే అవకాశం ఉందన్నారు. కంపెనీలో ఇప్పటి వరకు రూ.32 కోట్లు పెట్టుబడి పెట్టామని, యూఎస్, యూరప్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న క్వాంటెలాకు 150 మంది ఉద్యోగులు ఉన్నారని తెలియజేశారు.