రికార్డులకు బ్రేక్‌ : నష్టాల్లో మార్కెట్లు | Nifty closes lower on expiry day; PSU Bank index falls 5% | Sakshi
Sakshi News home page

రికార్డులకు బ్రేక్‌ : నష్టాల్లో మార్కెట్లు

Jan 25 2018 3:52 PM | Updated on Jan 25 2018 3:55 PM

Nifty closes lower on expiry day; PSU Bank index falls 5% - Sakshi

ముంబై : జనవరి నెల డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆరు రోజులుగా రికార్డులు సృష్టిస్తూ వచ్చిన మార్కెట్లు, నేటి ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 111 పాయింట్ల నష్టంలో 36,050 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంలో 11,069 వద్ద క్లోజయ్యాయి. మూలధన కేటాయింపుల ప్రకటన నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌లో లాభాలు కురిపించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో తీవ్ర అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీంతో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 5 శాతం మేర పతనమైంది. ఎస్‌బీఐ షేర్లు భారీగా 5 శాతం కిందకి పడిపోయాయి. 

అన్ని రంగాల్లో అతిపెద్ద లూజర్‌గా పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్సే నిలిచింది. ఎస్‌బీఐతో పాటు అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరో మోటోకార్ప్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాలు పాలయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కోల్‌ ఇండియాలు లాభాల్లో నడిచాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు మేర పెరిగి 63.58గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 131 రూపాయల లాభంలో రూ.30,380గా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement