భలే ఆఫర్‌ : పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్‌ 

MobiKwik Offers 50% Discount On Petrol Bills Today - Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వినియోగదారులకు వాత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ధరలు పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు డిజిటల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ మొబిక్విక్‌, పెట్రోల్‌పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నేడు పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొబిక్విక్‌ ఈ ఫ్లాష్‌ ఆఫర్‌ కేవలం రాత్రి 9 గంటల వరకు వర్తించనుంది. 

పెట్రోల్‌ ధరలపై వన్‌-డే ఆఫర్‌ కింద, మొబిక్విక్‌ యూజర్లు, 200 రూపాయలు లేదా ఆపై ఎక్కువ మొత్తాలతో లావాదేవీలు జరిపితే 100 రూపాయల సూపర్‌క్యాష్‌ను వాడుకోవచ్చు. 100 రూపాయల లావాదేవీకి కూడా ఈ సూపర్‌క్యాష్‌ను వాడుకోవచ్చు. ఈ ఆఫర్‌ కేవలం మొబిక్విక్‌తో భాగస్వామ్యమైన పెట్రోల్‌ పంపులకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు యూజర్లు, ఫ్యూయల్‌ స్టేషన్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి. ఈ ఆఫర్‌ వర్తించేందుకు కనీస లావాదేవీ రూ.100గా ఉండాలి. కాగా, ఆగస్టు 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. 

అత్యధిక క్రూడాయిల్‌ ధరలు, రూపాయి పతనం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ పతనంతో, క్రూడాయిల్‌ ఖరీదైనదిగా ఉంది. నేడు ఇండియన్‌ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేపట్టలేదు. దీంతో నేడు లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.82.16గా, ముంబైలో రూ.89.54గా, చెన్నైలో రూ.85.41గా, కోల్‌కతాలో రూ.84.01గా ఉన్నాయి. పేటీఎం కూడా ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల్లో రూ.7500 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌కు కనీస లావాదేవి రూ.50గా ఉండాలి. 2019 ఆగస్టు 1 వరకు పేటీఎం ఆఫర్‌ వాలిడ్‌లో ఉండనుంది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top