మిట్రాన్‌ యాప్ తొలగింపుపై స్పందించిన గూగుల్‌

Mitron May Make A Comeback On Google Play - Sakshi

ముంబై: టిక్‌టాక్కు పోటీగా అవతరించిన మిట్రాన్‌ యాప్‌ అనతి కాలంలోనే యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల కార‌ణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే సంస్థలకు ఏదయినా సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించడానికి సిద్దమేనని గూగుల్‌, ఆండ్రాయిడ్‌లు ప్రకటించాయి. మిట్రాన్‌ యాప్‌ కేవలం ఒక నెలలోనే 50 లక్షల డౌన్‌లోడ్లతో యూజర్లను అలరించింది. ఈ యాప్‌కు సంబంధించిన సమస్యకు తాము పరిష్కారం చూపించామని ఆండ్రాయిడ్‌, గూగుల్ప్లే పేర్కొంటు.. అయితే తాము సూచించిన నిబంధనలను పాటించాలని వైస్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ సామత్‌ పేర్కొన్నారు. ఇటీవల తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మిట్రాన్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది.

కాగా సైబ‌ర్ నిపుణులు సైతం విని‌యోగ‌దారుల వివ‌రాలు గోప్యంగా ఉంచేందుకు మిట్రాన్‌ యాప్ డెవ‌లప‌ర్స్ ఎటువంటి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌లేద‌ని.. యాప్‌ను తొలగించాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విపరీతమైన పోటీ కారణంగా యాప్‌లు నిబంధనలు పాటించడం లేదని.. తాము సమాజానికి ఉపయోగపడే నిబంధనలు రూపొందించామని గూగుల్‌ పేర్కొంది. ప్లే స్టోర్‌లో ఉన్న వివిధ యాప్‌లు గూగుల్‌ రూపొందించిన నియమాలను పాలించాల్సిందేనని సంస్థ స్పష్టం చేసింది. 

చదవండి: ప్లే స్టోర్‌లో క‌నిపించ‌ని మిట్రాన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top