మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్‌ లగ్జరీ కార్‌.. | Maserati launches Quattroporte GTS priced at ₹ 2.7 crore | Sakshi
Sakshi News home page

మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్‌ లగ్జరీ కార్‌..

Dec 13 2017 12:35 AM | Updated on Dec 13 2017 12:35 AM

Maserati launches Quattroporte GTS priced at ₹ 2.7 crore - Sakshi

న్యూఢిల్లీ: ఇటలీ లగ్జరీ కార్‌ కంపెనీ మాసెరటి కొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్‌ కారు ఖరీదు రూ.2.7 కోట్లు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ).ఈ లగ్జరీ కారును–గ్రాన్‌లుస్సో, గ్రాన్‌స్పోర్ట్‌ ట్రిమ్స్‌ల్లో కంపెనీ అందిస్తోంది. ఈ కారును 3.8 లీటర్ల ట్విన్‌–టర్బో ఇంజిన్‌తో రూపొందించామని కంపెనీ తెలిపింది.  530 హార్స్‌ పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ ఇంజిన్‌ వల్ల ఈ కారు  సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలోనే అందుకుంటుందని,   గరిష్ట వేగం గంటకు 310 కి.మీ. అని పేర్కొంది. వంద కి.మీ. ప్రయాణానికి 10.7లీటర్ల పెట్రోల్‌ అవసరమని తెలిపింది.

ఈ కారులో వాయిస్‌ కమాండ్స్‌తో కూడా పనిచేసే ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌..8.4 అంగుళాల మాసెరటి టచ్‌ కంట్రోల్‌ ప్లస్‌ను ఏర్పాటు చేశామని, ఇది యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోలతో అనుసంధానమై ఉంటుందని  వై–ఫై, ఫోన్‌ మిర్రరింగ్‌  ఆప్షన్‌లు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇంకా ఈ కారులో ఎనిమిది గేర్ల జడ్‌ఎఫ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్, ఆటో అడాప్టివ్‌ సాఫ్ట్‌వేర్,  900 వాట్, 10–స్పీకర్‌ హార్మన్‌ కార్డన్‌ప్రీమియమ్‌ సౌండ్‌ సిస్టమ్‌ (స్టాండర్డ్‌) గ్లేర్‌ ఉండని అడాప్టివ్‌ ఫుల్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 20 అంగుళాల మెర్క్యురియో అలాయ్‌ వీల్స్‌ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది.

ఆస్టన్‌ మార్టిన్‌ రాపిడె, పోర్షే పనమెరా కార్లకు ఈ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. ప్రస్తుతం మాసెరటి కంపెనీ భారత్‌లో క్వాట్రోపోర్టే, స్పోర్టీ సెడాన్‌ గిబ్లిలతో పాటు గ్రాన్‌ ట్యురిజ్మో, గ్రాన్‌కాబ్రియో వంటి స్పోర్ట్స్‌ కార్లను కూడా విక్రయిస్తోంది. త్వరలో ఎస్‌యూవీ లావంటెను మార్కెట్లోకి తేనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement