షావోమికి ఝలక్‌.. టైటానియం జంబో స్మార్ట్‌ఫోన్‌ | Karbonn Titanium Jumbo With 8-Megapixel Selfie Camera Launched | Sakshi
Sakshi News home page

షావోమికి ఝలక్‌.. టైటానియం జంబో స్మార్ట్‌ఫోన్‌

Oct 25 2017 12:05 PM | Updated on Nov 6 2018 5:26 PM

Karbonn Titanium Jumbo With 8-Megapixel Selfie Camera Launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్‌ మరో సరికొత్త   స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది.  టైటానియం సిరీస్‌ కొనసాగింపుగా  ‘కార్బన్‌  టైటానియం జంబో’  పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.   దీని ఎంఆర్‌పీ ధర రూ.7,490 కాగా, మార్కెట్‌ ఆపరేటింగ్‌ ధర కింద రూ.6,490కే అందించనున్నట్టు  కార్బన్‌ ప్రకటించింది.  అలాగే ఫోన్‌తో పాటు ప్యానల్‌ కవర్‌ను కూడా ఉచితంగా సంస్థ అందిస్తోంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి తమ తాజా  ఫోన్‌ ప్రత్యేకత అనీ స్టాండ్‌బై మోడ్‌లో 400 గంటల టాక్‌టైమ్‌, 16గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.  దీంతో  స్పీడ్‌ ,   కెమెరా, ధరతో పోల్చుకుంటే.. ఈ డ్యుయల్‌ సిమ్‌ టైటానియం జంబో..షావోమి రెడ్‌మి 4 మొబైల్‌కు  గట్టి  పోటీ ఇస్తుందని  నిపుణులు భావిస్తున్నారు.

టైటానియం జంబో  ఫీచర్లు
 5 అంగుళాల స్క్రీన్‌
1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
 ఆండ్రాయిడ్‌ 7.0  నౌగట్‌
 2జీబీ ర్యామ్‌
16 జీబీ స్టోరేజ్‌
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
 8 మెగాపిక్సెల్‌  సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement