జియోఫైబర్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్‌ | JioFiber Users to Get Exclusive Complimentary Access to Lionsgate Play Content | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ యూజర్ల కోసం లయన్స్‌గేట్‌ కంటెంట్‌

Jul 8 2020 9:08 PM | Updated on Jul 8 2020 9:14 PM

JioFiber Users to Get Exclusive Complimentary Access to Lionsgate Play Content - Sakshi

ముంబై: జియో వినియోగదారులకు శుభవార్త. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. జియోఫైబర్‌ సిల్వర్, అంతకు మించిన ప్లాన్‌ వారకి లయన్స్‌గేట్ ప్లే కంటెంట్ అందుబాటులోకి రానుంది. స్టార్జ్ ఒరిజినల్ సిరీస్, ఫస్ట్-రన్‌ సినిమాలతోపాటు ఇతర టీవీ, సినిమా కంటెంట్ (7500 ఎపిసోడ్లు), ఇతర పాపులర్ ప్రోగ్రామ్స్‌ను జియో ఫైబర్ వినియోగదారులు వీక్షించవచ్చు. ఈ రోజు నుంచే ఇది అమల్లోకి వచ్చింది. లయన్స్‌గేట్‌లో హారర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, సినిమాల కంటెంట్ ఉంటుంది.

ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో లయన్స్‌గేట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలను వీక్షించవచ్చు. ఈ కాంప్లిమెంటరీని జియోఫైబర్ సిల్వర్ యూజర్లు (ఒక నెల కంటే ఎక్కువ నెలలు ప్లాన్లు) వీక్షించవచ్చు. అలాగే, కొత్త వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోటీవీ+ యాప్ నుంచి జియోఫైబర్ యూజర్లు లయన్స్ గేట్ ప్లే కంటెంట్ చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా లాగిన్ అవ్వడం లేదా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్‌లోడ్స్)

సాధారణం కన్నా ఎక్కువ కంటెంట్‌ను వీక్షించాలనుకునే జియోఫైబర్ యూజర్లు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లాన్‌లో హై స్పీడ్, ఎక్కువ బ్రాడ్ బ్యాండ్ డాటా లభిస్తుంది. గోల్డ్ ప్లాన్ భిన్నరకాలైన సేవలను అందిస్తుంది. గోల్డ్ ప్లాన్‌లో 250 ఎంబీపీఎస్‌ స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలకి 1750 జీబీ డేటా), దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అంతర్జాతీయ కాల్స్‌ను తక్కువ ధరకే అందిస్తుంది. దీని ఎనీటైమ్ టీవీ ద్వారా ప్రీమియం ఓటీటీలు అయిన లయన్స్‌గేట్ ప్లే, జీ 5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, సోనీలివ్, సన్‌నెక్స్ట్, వూట్, ఆల్ట్‌బాలాజీ, హోయిచోయ్, షెమరూమ్, జియో సినిమా, జియోసావ్న్ వంటి ప్రీమియం ఓటీటీ లాంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు గోల్డ్‌ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ ), అన్ లిమిటెడ్ మ్యూజిక్, గేమ్స్, జియోయాప్స్‌ని అన్లిమిటెడ్‌గా యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement