జెట్‌ ఎయిర్‌వేస్‌ను టేకోవర్‌ చేస్తాం

 Jet airways Staff offers to take over Jet Airways - Sakshi

ఎస్‌బీఐకి లేఖ రాసిన ఉద్యోగ సంఘాలు

న్యూఢిల్లీ:  జెట్‌ ఎయిర్‌వేస్‌ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా ఆ కంపెనీ ఉద్యోగ సంఘాలు కంపెనీని నడిపించడానికి ముందుకు వచ్చాయి. పైలెట్లు, ఇంజనీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌కు ఒక లేఖ రాశాయి. రూ.7,000 కోట్ల మేర నిధులు సమీకరించగలమని, జెట్‌ను టేకోవర్‌ చేస్తామని ఆ లేఖలో ఆ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎస్‌డబ్ల్యూఐపీ(ద సొసైటీ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌)లో 800 మంది, జేఏఎమ్‌ఈవీఏ(జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌)లో 500 మంది వరకూ సభ్యులున్నారు. కాగా జెట్‌ టేకోవర్‌కు సంబంధించిన బిడ్‌లు దాఖలు చేసే గడువు  తేదీ దాటిపోయింది. టేకోవర్‌కు అర్హత సాధించే  కంపెనీల తుది జాబితా వచ్చే నెల 10న వెల్లడి కావచ్చు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top