కంపెనీల వైపు ఐటీ ఉద్యోగుల చూపు..

IT Employees Crowd The Job Street - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో వేలాది ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కంపెనీలు ఉద్యోగాల తొలగింపు, వేతనాలలో కోతలు విధిస్తున్నాయి. కాగా గత రెండు వారాలుగా ఐటీ కంపెనీలకు వేలాదిగా ఉద్యోగ దరఖాస్తులు వచ్చినట్లు ఏబీసీ కన్సల్టెంట్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రత్న గుప్తా తెలిపారు. అయితే ఐటీ కంపెనీలు ఉద్యోగార్థుల నుంచి అత్యుత్తమ నైపుణ్యాలను ఆశిస్తున్నట్లు ప్రముఖ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

అయితే 40శాతం సీనియర్‌ లెవల్‌ ఐటీ ఉద్యోగులు కంపెనీలకు దరఖాస్తులు చేస్తున్నారని ఫీనో అనే స్టాఫింగ్‌ సంస్థ తెలిపింది. కరోనా నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫీనో సహవ్యవస్థాపకుడు కమల్‌ కరంత్‌ పేర్కొన్నారు. ఇటీవల కాలంటో ఐటీ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్‌, కాగ్నిజెంట్‌లు ఖర్చులు తగ్గించడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే డిజిటల్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: ఐటీ చరిత్రలో సంచలన కలయిక)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top