తయారీ, మైనింగ్‌ పేలవం | India's industrial output growth falls to 2 persant | Sakshi
Sakshi News home page

తయారీ, మైనింగ్‌ పేలవం

Aug 10 2019 5:30 AM | Updated on Aug 10 2019 5:30 AM

India's industrial output growth falls to 2 persant - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► మైనింగ్, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి.  

► దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్‌ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్‌ వచ్చే సరికి భారీగా జారిపోయింది.  

► తయారీ: 2018 జూన్‌లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్‌లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి.  

► క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్‌లను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది.  

► మైనింగ్‌: మైనింగ్‌లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది.  

► విద్యుత్‌: విద్యుత్‌ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది.  

► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: కార్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –5.5 శాతం క్షీణత నమోదయ్యింది.  

► కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌: కాస్మొటిక్స్, క్లీనింగ్‌ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్‌ మూ వింగ్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది.
 

జూన్‌ త్రైమాసికమూ మందగమనమే
ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్‌ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement