ఉద్యోగ నియామకాల వృద్ధి 22 శాతం: నౌకరీ | India Inc hiring sentiment up in June: Naukri | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామకాల వృద్ధి 22 శాతం: నౌకరీ

Jul 14 2016 1:32 AM | Updated on Sep 4 2017 4:47 AM

ఉద్యోగ నియామకాల వృద్ధి 22 శాతం: నౌకరీ

ఉద్యోగ నియామకాల వృద్ధి 22 శాతం: నౌకరీ

దేశంలో ఉద్యోగ నియామకాలు జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 22 శాతంమేర పెరిగాయి. ఐటీ, టెలికం, హెల్త్‌కేర్ రంగాలు నియామకాల వృద్ధికి దన్నుగా నిలిచాయి.

‘పన్ను’ మినహాయింపు పరిమితి పెంపు

 న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ నియామకాలు జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 22 శాతంమేర పెరిగాయి. ఐటీ, టెలికం, హెల్త్‌కేర్ రంగాలు నియామకాల వృద్ధికి దన్నుగా నిలిచాయి. అలాగే రానున్న నెలల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని, మరిన్ని ఇతర రంగాల్లో కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ ఊపందుకుంటుందని నౌకరీ.కామ్ తన సర్వేలో పేర్కొంది. కాగా నౌకరీ ఉద్యోగ సూచీ జూన్‌లో 2,129కు ఎగసింది. సర్వే ప్రకారం..

నియామకాల వృద్ధి ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగంలో 19 శాతంగా, హెల్త్‌కేర్ రంగంలో 37 శాతంగా ఉంది. ఐటీ హార్డ్‌వేర్ అండ్ టెలికం, ఫైనాన్స్ విభాగాల్లోని ప్రొఫెషనల్స్ డిమాండ్ వరుసగా 13 శాతం, 11 శాతం మేర వృద్ధి చెందింది. ఇక పట్టణాల వారీగా చూస్తే.. నియామకాల వృద్ధి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 46 శాతంగా, చెన్నైలో 43 శాతంగా, హైదరాబాద్‌లో 36 శాతంగా ఉంది. అలాగే నియామకాల వృద్ధి ముంబైలో 24 శాతంగా, బెంగళూరులో 18 శాతంగా, పుణేలో 13 శాతంగా నమోదయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement