‘ఐ లవ్‌ ఇండియన్‌ మీడియా’

I Love Indian Media Donald Trump Jr - Sakshi

న్యూఢిల్లీ : అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొడుకు ట్రంప్‌ జూనియర్‌  దేశీయ మీడియాపై పొగడ్తల వర్షం కురిపించారు. భారత మీడియాను తాను చాలా ప్రేమిస్తానని... కఠినంగా, క్రూరంగా ఉండే అమెరికా మీడియతో పోల్చుకుంటే, భారత మీడియా చాలా మృదువుగా ఉంటుందన్నారు. ఒక్కడ జరుగుతున్న గ్లోబల్‌ బిజినెస్‌ సమిట్‌లో ట్రంప్‌ జూనియర్‌ పాల్గొన్నారు. ‘భారత మీడియాను ప్రేమిస్తున్నట్టు చెబుతున్న భారత చరిత్రలో మొదటి వ్యక్తిని నేనే. వీరు చాలా మృదువుగా ఉంటారు’ అని తెలిపారు. ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు వచ్చినప్పటికీ భారతీయుల ముఖంపై చిరునవ్వు చెదరదని చెప్పారు. ‘నేను తొలిసారి ఇక్కడికి రాలేదని, కానీ 10 ఏళ్లతో తర్వాత భారత పర్యటనకు’ వచ్చినట్టు తెలిపారు.

రాజకీయాలపై మాట్లాడటానికి నిరాకరించిన జూనియర్‌ ట్రంప్‌, తాను ఇక్కడి ఒక వ్యాపారవేత్తలాగే వచ్చానన్నారు. ఇండో-పసిఫిక్‌ సంబంధాలు : కోఆపరేషన్‌పై కొత్త శకం అనే అంశంపై మాట్లాడతారని ముందస్తుగా షెడ్యూల్‌ సన్నద్ధం చేయగా.. చివరి నిమిషంలో జూనియర్‌ ట్రంప్‌ తన ప్రసంగాన్ని మార్చేశారు. భారత్‌లో వ్యాపార పరిస్థితుల మార్పులపై ఆయన ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా మంచి మంచి డీల్స్‌ కుదిరాయని, ప్రస్తుతం 10 టైమ్స్‌ కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే సామర్థ్యం వచ్చిందన్నారు. ట్రంప్‌ జూనియర్‌ తన వ్యాపారానికి సంబంధించిన పనుల నిమిత్తం భారత్‌లో పర్యటిస్తున్నారు. ట్రంప్‌ టవర్స్‌ పేరిట ట్రంప్‌ జూనియర్‌ ఇక్కడ తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అమెరికా తర్వాత ట్రంప్‌ భారీ ప్రాజెక్టులు ఉన్నది భారత్‌లోనే. అయితే అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌పై అక్కడి మీడియా పెద్ద ఎత్తున్నే విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి మీడియాను ఉద్దేశిస్తూ.. భారత మీడియాపై పొగడ్తలు కురిపించారు ట్రంప్‌ జూనియర్‌. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top