హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. స్పోర్ట్స్ ఎడిషన్ | Hyundai India launches new i10 Grand SportZ edition | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. స్పోర్ట్స్ ఎడిషన్

Sep 4 2014 12:50 AM | Updated on Sep 2 2017 12:49 PM

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. స్పోర్ట్స్ ఎడిషన్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10.. స్పోర్ట్స్ ఎడిషన్

హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 మోడల్‌లో స్పోర్ట్స్ ఎడిషన్, గ్రాండ్ స్పోర్ట్స్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

 న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 మోడల్‌లో స్పోర్ట్స్ ఎడిషన్, గ్రాండ్ స్పోర్ట్స్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చి ఏడాదైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ గ్రాండ్ స్పోర్ట్జ్ కారును రెండు వేరియంట్లు-యూ2 1.1 లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజిన్(ధర రూ.5.98 లక్షలు), 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌లలో(ధర రూ.5.11 లక్షలు, రెండూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ ధరలు) అందిస్తున్నామన్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఐ10ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటి వరకూ 1.1 లక్షల వినియోగదారులకు విక్రయించామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్, బ్లూ టూత్ కనెక్టివిటి, స్టీరింగ్‌పై ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్, రియర్ స్పా యిలర్, బి-పిల్లర్ బ్లాకవుట్ వంటి ప్రత్యేకతలున్నాయన్నారు. డీజిల్ కారు 24 కి.మీ. మైలేజీని, పెట్రోల్ కారు 18.9 కి.మీ. మైలేజీని ఇస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement