మెగా డీల్‌ : హెచ్‌యూఎల్‌ చేతికి హార్లిక్స్‌

HUL approves merger with GSK Consumer, to buy Horlicks and other products for 3.3 billion euros  - Sakshi

ఎట్టకేలకు  హార్లిక్స్‌ డీల్‌

నెస్లేకు దక్కని హార్లిక్స్‌

హిందుస్థాన్‌ యూనీలీవర్‌ చేతికి హార్లిక్స్‌

నెస్లేకు దక్కని హార్లిక్స్‌ హిందుస్థాన్‌ యూనీలీవర్‌ చేతికి దక్కింది. ఎట్టకేలకు హార్లిక్స్‌ డీల్‌ పూర్తయింది. వివిధ అంచనాలు, ఊహాగానాలు మధ్య మెగా ఎఫ్‌ఎంజీ డీల్‌కు శుభం కార్డు పడింది. జీఎస్‌కేకు చెందిన హార్లిక్స్‌ ఇతర ఉత్పత్తులు యూనీలీవర్‌ ఆధ్వర్యంలోకి రానున్నాయి. ఆంగ్లో డచ్‌ దిగ్గజం యూనీలీవర్‌ ఈ ఒప్పంద వివరాలను సోమవారం వెల్లడించింది. దీంతో  గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (జీఎస్‌కె) ఇండియాకు  పోషకారహార వ్యాపారం త్వరలో యూనీలీవర్‌ (హెచ్‌యూఎల్‌) పరం కానుంది. ఈ మేరకు ఇరు సంస్థలు బోర్డులు ఆమోదం లభించినట్టు యూనీలీవర్‌ వెల్లడించింది.

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ హిందుస్థాన్‌ యూనీలీవర్‌, జీఎస్‌కె సంస్థకు చెందిన హార్లిక్స్‌ను  దక్కించుకునేందుకు 3.3 బిలియన్ల యూరోలను చెల్లించనుంది. ఈ మేరకు ఒప్పందాన్ని  ఖరారు చేసింది. రానున్న 12నెలల్లో (4.39 నిష్పత్తి ప్రకారం) ఈ డీల్‌ పూర్తికానుందని కంపెనీ తెలిపింది.

కాగా హార్లిక్స్‌ రేసులో యునిలీవర్‌తో పాటు కోకకోలా, క్రాఫ్ట్‌ హైంజ్‌, నెస్లే వంటి ఇతర దిగ్గజ కంపెనీలూ పోటీ పడ్డాయి.  ముఖ్యంగా సుమారు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.28000 కోట్లు) జీఎస్‌కె ఇండియాకు చెందిన 72.5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని నెస్లే భారీ వ్యూహాలను రచించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top