జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ లక్ష కోట్లు 

GST collections are again a quarter crore - Sakshi

ఐదు నెలల తర్వాత 

అక్టోబర్‌లో రూ.1,00,710 కోట్లు  

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఐదు నెలల తర్వాత మళ్లీ లక్షకోట్లు దాటాయి. పండుగల సీజన్, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఆర్థికమంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్ర కారం– అక్టోబర్‌లో రూ. 1,00,710 కోట్ల జీఎస్‌టీ వ సూళ్లు జరిగాయి. వ్యాపార విభాగానికి సంబంధించి 67.45 లక్షల  రిటర్న్స్‌ దాఖలయ్యాయి. కేరళ (44 శాతం), జార్ఖండ్‌ (20%), రాజస్తాన్‌ (14 శాతం), ఉత్తరాఖండ్‌ (13 శాతం), మహారాష్ట్ర (11 శాతం), జీఎస్‌టీ వసూళ్ల మంచి పనితనాన్ని ప్రదర్శించాయి.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్‌ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. మేలో ఈ వసూళ్లు రూ.95,016 కోట్లు, జూన్‌లో రూ.95,610 కోట్లు, జూలైలో రూ.96,483 కోట్ల వసూళ్లు జరిగాయి.  ఆగస్టులో ఈ వసూళ్లు రూ.93,960 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.94,442 కోట్లుగా నమోదయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top