గో ఎయిర్‌ చౌక ధరలు | Go Air Tickets Offer | Sakshi
Sakshi News home page

గో ఎయిర్‌ చౌక ధరలు

Jun 19 2019 11:20 AM | Updated on Jun 19 2019 11:55 AM

Go Air Tickets Offer - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ గో ఎయిర్‌ మినికేషన్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి పలు నగరాలకు టికెట్‌ ధరలను రూ.1,798 నుంచి ఆఫర్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1,798, బెంగళూరు, లక్నో రూ.1,799, కోల్‌కతా రూ.1,983, కొచ్చి రూ.2,499, ఢిల్లీకి రూ.2,599 చార్జీ చేస్తారు. బుకింగ్‌ పీరియడ్‌ జూన్‌ 18 నుంచి 23 వరకు ఉంది. జూలై 1 నుంచి సెప్టెంబరు 30లోగా కస్టమర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గో ఎయిర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement