
న్యూయార్క్: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ దూకుడు పెంచింది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత‍్పత్తిలో భారీ పెట్టుబడులు పెడుతోంది. రాబోయే యేళ్లలో మరిన్ని హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.
2022 నాటికి 40 హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లను ఉత్పత్తి చేస్తామని డెట్రాయిట్ ఆధారిత సంస్థ ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ చెప్పారు. సుమారు 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టునున్నట్టు ఆదివారం వెల్లడించారు. దీంతో తమ పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నారు. అయితే వినియోగదారులు తమతో ఉంటారా లేదా అనేదే పెద్ద ప్రశ్న ఉన్నప్పటికీ, సమాధానం మాత్రం సానుకూలంగా ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 16 ఎలక్ట్రిక్ , 24 హైబ్రిడ్ వాహనాలను జోడించాలని యోచిస్తోంది., 2020 నాటికి తమ హైబ్రిడ్ ఎఫ్-150 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంటుందని 2018 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో కంపెనీ వెల్లడించింది.