ఫీచర్‌ ఫోన్లలోనూ జీపీఎస్‌ తప్పనిసరి | DoT insists GPS on all handsets, featurephone prices to rise by 30% | Sakshi
Sakshi News home page

ఫీచర్‌ ఫోన్లలోనూ జీపీఎస్‌ తప్పనిసరి

Jul 11 2017 1:33 AM | Updated on Sep 5 2017 3:42 PM

చౌక ఫీచర్‌ ఫోన్లలో ఖరీదైన జీపీఎస్‌ టెక్నాలజీకి బదులుగా ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఉపయోగిస్తామన్న మొబైల్స్‌ తయారీ సంస్థల ప్రతిపాదనను..

తయారీ సంస్థలకు డాట్‌ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: చౌక ఫీచర్‌ ఫోన్లలో ఖరీదైన జీపీఎస్‌ టెక్నాలజీకి బదులుగా ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఉపయోగిస్తామన్న మొబైల్స్‌ తయారీ సంస్థల ప్రతిపాదనను టెలికం విభాగం (డాట్‌) తోసిపుచ్చింది. వినియోగదారులు ...ముఖ్యంగా మహిళల భద్రత దృష్ట్యా జీపీఎస్‌ తప్పనిసరని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్‌ యూజర్లున్న ప్రాంతాన్ని సత్వరం కనిపెట్టగలిగేలా ..

2018 జనవరి 1 నుంచి దేశీయంగా విక్రయించే ఫీచర్‌ ఫోన్లు సహా అన్ని మొబైల్స్‌లోను జీపీఎస్‌ ఫీచర్‌ను పొందుపర్చాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన టెక్నాలజీ వల్ల ఫీచర్‌ ఫోన్స్‌ ధర 50 శాతం పైగా పెరుగుతుందని, కాబట్టి ప్రత్యామ్నాయ టెక్నాలజీని వాడేందుకు అనుమతించాలని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ (ఐసీఏ).. డాట్‌ను కోరింది.  అయితే  దీనికి అనుమతించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement