రూ.లక్షలోపు మోసాలపై పోలీసు కేసులొద్దు | Don't report frauds below Rs 1 lakh to police: CVC to banks | Sakshi
Sakshi News home page

రూ.లక్షలోపు మోసాలపై పోలీసు కేసులొద్దు

Jun 17 2017 1:31 AM | Updated on Sep 5 2017 1:47 PM

రూ.లక్షలోపు మోసాలపై పోలీసు కేసులొద్దు

రూ.లక్షలోపు మోసాలపై పోలీసు కేసులొద్దు

ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.లక్షలోపు మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) కోరింది.

బ్యాంకులకు సీవీసీ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.లక్షలోపు మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) కోరింది. బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటే తప్పిస్తే దానిపై పోలీసులను ఆశ్రయించనవసరం లేదని స్పష్టం చేసింది. రూ.10,000కు పైన రూ.లక్షలోపు విలువగల మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న నిబంధన ఇప్పటి వరకు అమల్లో ఉంది.

అయితే, ఈ కేసులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఆర్‌బీఐతో సంప్రదించిన అనంతరం సీవీసీ తాజా నిర్ణయం తీసుకుంది. రూ.10,000కుపైన రూ.లక్షలోపు మోసాల్లో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంటే మాత్రం వాటిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన ఆదేశాల్లో సీవీసీ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement