సెల్‌కాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ క్యాంపస్ ఏ518 | Celkon Campus A518 Mobile | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ క్యాంపస్ ఏ518

Apr 28 2015 1:14 AM | Updated on Aug 27 2019 4:36 PM

సెల్‌కాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ క్యాంపస్ ఏ518 - Sakshi

సెల్‌కాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ క్యాంపస్ ఏ518

మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ సెల్‌కాన్.. క్యాంపస్ సిరీస్‌లో పెద్ద స్క్రీన్‌తో రూపొందిన ఏ518 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ధర రూ.4,500
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ సెల్‌కాన్.. క్యాంపస్ సిరీస్‌లో పెద్ద స్క్రీన్‌తో రూపొందిన ఏ518 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అన్ని రకాల ఆదాయ వర్గాల ప్రజలను ఆకర్షించేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. ధర రూ.4,500. ఆధునిక ఫీచర్లతో మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ సీఎండీ వై.గురు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, 1 గిగా హెట్జ్ ప్రాసెసర్, కిట్‌క్యాట్ ఓఎస్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3జీ వీడియో కాలింగ్, ఫ్లాష్‌తో కూడిన 3.2 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై వంటి ఫీచర్లున్నాయి. 32జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. వైట్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కవర్, స్క్రీన్‌గార్డ్ ఉచితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement