149కే అపరిమిత వాయిస్‌ కాల్స్, డేటా | BSNL Rs. 149 Plan to Offer Unlimited Voice Calls and Data | Sakshi
Sakshi News home page

149కే అపరిమిత వాయిస్‌ కాల్స్, డేటా

Dec 19 2016 1:39 AM | Updated on Sep 4 2017 11:03 PM

149కే అపరిమిత వాయిస్‌ కాల్స్, డేటా

149కే అపరిమిత వాయిస్‌ కాల్స్, డేటా

ఏ నెట్‌ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌కు వీలు కల్పించే నెలవారీ పథకాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకురానుంది. ఉచిత డేటాతో కలుపుకుని ఈ ప్లాన్‌ ధర రూ.149గా ఉండనుంది.

జనవరి 1 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన పథకం
భోపాల్‌: ఏ నెట్‌ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌కు వీలు కల్పించే నెలవారీ పథకాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకురానుంది. ఉచిత డేటాతో కలుపుకుని ఈ ప్లాన్‌ ధర రూ.149గా ఉండనుంది. ఏ నెట్‌వర్క్‌కు అయినా స్థానిక, ఎస్టీడీ అపరిమిత కాల్స్‌తోపాటు కొంత ఉచిత డేటాతో కలుపుకుని రూ.149 లేదా అంతకంటే తక్కవకే వచ్చే నెల నుంచి ఓ పథకాన్ని తీసుకురానున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. భోపాల్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధాన దిశలో ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నామని శ్రీవాస్తవ వెల్లడించారు. ‘‘ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్నాం. తర్వాత ఆరో స్థానికి పడిపోయాం. ఇప్పుడు తిరిగి నాలుగో స్థానానికి చేరుకున్నాం’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం 10 శాతం కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వెంట ఉన్నారని, 15 శాతానికి పెంచుకునే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వాయిస్‌కాల్స్‌ బస్‌ చేజారిపోయిందని, డేటా వ్యాపార బస్‌ మాత్రం చేజారనివ్వమన్నారు. ల్యాండ్‌లైన్‌ వ్యాపారంపైనా దృష్టి పెట్టామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement