భలే ఆఫర్‌ : 99 రూపాయలకే 45జీబీ డేటా

BSNL Introduces Daily Broadband Plans Starting From Rs 99 - Sakshi

ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌, భారత్‌లో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్‌గా దూసుకుపోతుంది. మరే ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ ప్రొవైడర్‌ అందించని ప్లాన్లను ఆఫర్‌ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ నాలుగా కొత్త నాన్‌-ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించింది. అవి ఒకటి 99 రూపాయల ప్లాన్‌, రెండు 199 రూపాయల ప్లాన్‌, మూడు 299 రూపాయల ప్లాన్‌, నాలుగో 399 బీబీజీ యూఎల్‌డీ కోంబోలతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వీటిని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు. 45 జీబీ నుంచి 600 జీబీ వరకు డేటాను ఆఫర్‌ చేయనున్నామని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ల డౌన్‌లోడ్‌ స్పీడు 20 ఎంబీపీఎస్‌. ఒక్కసారి రోజువారీ పరిమితి అయిపోతే, ఈ స్పీడు 1ఎంబీపీఎస్‌కు దిగి వస్తుందని టెలికాంటాక్‌ రిపోర్టు చేసింది. 

  • 99 రూపాయల ప్లాన్‌పై బీఎస్‌ఎన్‌ఎల్‌ మొత్తంగా 45 జీబీ డేటాను అందిస్తోంది. దీని రోజువారీ పరిమితి 1.5జీబీ. 
  • అదేవిధంగా 199 రూపాయల 150 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 5 జీబీ డేటా.   
  • 299 రూపాయల 300 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 10 జీబీ డేటా.
  • 399 రూపాయల 600 జీబీ ప్లాన్‌ రోజువారీ పరిమితి 20 జీబీ డేటా.

ఈ ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత ఈ-మెయిల్‌ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌ను అందిస్తోంది. తొలుత 90 రోజుల వాలిట్‌తో ప్రమోషనల్‌ బేసిస్‌లో వీటిని లాంచ్‌చేసింది. డిమాండ్‌ బట్టి ఒకవేళ ఈ ప్లాన్ల తుదిగడువును పెంచాల్సి వస్తే పెంచుతామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. పాత యూజర్లు ఈ ప్లాన్లలోకి తరలి రాలేరని, కేవలం కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ​ ప్లాన్లను కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్‌ చేయాలి. ఆరు నెలల అనంతరం ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలోకి యూజర్లు వెళ్లిపోవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top