వృద్ధిలో టాప్... టీసీఎస్ బ్రాండ్ | Brand TCS Grows Fastest Among Global IT Firms | Sakshi
Sakshi News home page

వృద్ధిలో టాప్... టీసీఎస్ బ్రాండ్

Feb 20 2015 1:51 AM | Updated on Sep 2 2017 9:35 PM

టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి సాధించిన సాఫ్ట్‌వేర్ బ్రాండ్‌గా అవతరించింది.

ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి సాధించిన సాఫ్ట్‌వేర్ బ్రాండ్‌గా అవతరించింది. 2010లో 230కోట్ల డాలర్లుగా ఉన్న తమ బ్రాండ్ విలువ 2015 కల్లా 271 శాతం వృద్ధితో 870 కోట్ల డాలర్లకు చేరిందని టీసీఎస్ తెలిపింది.అంతర్జాతీయ బ్రాండ్ వాల్యూయేషన్ సంస్థ, బ్రాండ్ ఫైనాన్స్‌ను ఉటంకిస్తూ టీసీఎస్ ఈ వివరాలు వెల్లడించింది.

ఐటీ పరిశ్రమలో ఉండే అత్యున్నత బ్రాండ్ రేటింగ్ ఏఏప్లస్‌ను నిలుపుకున్నామని టీసీఎస్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. ఐటీ సర్వీసుల విభాగంలో ప్రపంచంలో అగ్రశ్రేణి నాలుగు బ్రాండ్లలో ఒకటిగా వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచామని వివరించారు. 46 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న టీసీఎస్‌లో 3,18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement