ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్‌‌ ఇదే..

Bank Association Announced Wilful Defaulters List - Sakshi

ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు టోకరా ఇస్తున్న ఉద్ధేశపూర్వక ఎగవేతదారులు (డిఫాల్టర్ల్స్‌ లిస్ట్)‌ను సెప్టెంబర్‌ 2019 వరకు బ్యాంక్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 2019 వరకు బ్యాంకులకు ఎగనామాలు పెట్టిన కంపెనీల లిస్ట్‌ను ఆల్ ఇండియా బ్యాంక్స్‌ ఎంప్లాయ్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఇందులో  2426 అకౌంట్స్‌ ద్వారా బ్యాంకులకు లక్షా 47 వేల 350 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.  దేశ ఆర్థిక వ్యవస్ధకు పెనుసవాల్‌గా భావిస్తున్న ఎగవాతదారుల జాబితాను విడుదల చేయడం హర్షనీయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 17 ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోకరా ఇచ్చిన ఎగవేతదారుల వివరాలు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఉద్దేశపూర్వక ఎగవేత దారులు 685 మంది కాగా చెల్లించని మొత్తం 43వేల 887 కోట్లు
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 325, చెల్లించని మొత్తం 22వేల 370 కోట్లు
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 355, చెల్లించని మొత్తం 14వేల 661 కోట్లు
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 184, చెల్లించని మొత్తం 11వేల 250 కోట్లు
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిఫ్లాల్టర్స్‌(ఎగవేత దారులు) సంఖ్య 69,  చెల్లించని మొత్తం 9 వేల 663 కోట్లు
యునైట్‌డ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 128,  చెల్లించని మొత్తం 7 వేల 028 కోట్లు
యుకో బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 87,  చెల్లించని మొత్తం 6 వేల 813 కోట్లు
ఒబిసి డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 138,  చెల్లించని మొత్తం 6 వేల 549 కోట్లు
కెనరా బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 96, చెల్లించని   మొత్తం 5 వేల 276 కోట్లు
ఆంధ్రా బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు)‌ సంఖ్య 84 , చెల్లించని   మొత్తం 5 వేల 165  కోట్లు
అలాహాబాద్ బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ సంఖ్య 57, చెల్లించని   మొత్తం 4 వేల 339 కోట్లు
ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 49 , చెల్లించని   మొత్తం 3 వేల 188  కోట్లు
కార్పొరేషన్‌ బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 58 , చెల్లించని   మొత్తం 2 వేల 450  కోట్లు
ఇండియన్‌ బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 27 , చెల్లించని   మొత్తం 1 వేల 613 కోట్లు
సిండికేట్ బ్యాంక్‌ డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు) సంఖ్య 36 , చెల్లించని   మొత్తం 1 వేల 438 కోట్లు
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర డిఫ్లాల్టర్స్(ఎగవేత దారులు)‌ సంఖ్య 42, చెల్లించని   మొత్తం 1 వేల 405 కోట్లు
పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌  డిఫ్లాల్టర్స్‌ (ఎగవేత దారులు)సంఖ్య 6 , చెల్లించని   మొత్తం 255 కోట్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top