మొబిక్విక్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌కి 13 శాతం వాటా | Bajaj Finance to acquire 12.6% stake in Mobikwik | Sakshi
Sakshi News home page

మొబిక్విక్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌కి 13 శాతం వాటా

Jan 17 2018 12:25 AM | Updated on Jan 17 2018 12:25 AM

న్యూఢిల్లీ: మొబైల్‌ వాలెట్‌ కంపెనీ మొబిక్విక్‌లో 12.60 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. నిజానికి రూ. 225 కోట్లతో 10.83 శాతం వాటా కొనుగోలు చేసేందుకు గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా వాటా పరిమాణం కొంత పెరిగిందని, కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల కన్వర్షన్‌ ధర మారటమే ఇందుకు కారణమని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలియజేసింది. 

ఇందుకోసం గతంలో అంగీకరించిన మొత్తమే తప్ప .. కొత్తగా మరింత పెట్టుబడేమీ పెట్టలేదని కంపెనీ తెలిపింది. ఒప్పందం ప్రకారం మొబిక్విక్‌కి చెందిన 10 ఈక్విటీ షేర్లను, 2,71,050 కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను (సీసీసీపీఎస్‌) బజాజ్‌ ఫైనాన్స్‌ కొనుగోలు చేయనుంది. బీఎస్‌ఈలో మంగళవారం బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు 3 శాతం క్షీణించి రూ.1,688 వద్ద క్లోజయ్యింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement