అట్టహాసంగా ఆటో ఎక్స్‌పో 2018 ప్రీ ఈవెంట్‌ | Auto Expo 2018, pre-open event | Sakshi
Sakshi News home page

ఆటో ఎక్స్‌పో 2018 ప్రీ ఈవెంట్‌

Feb 7 2018 12:09 PM | Updated on Feb 7 2018 1:43 PM

Auto Expo 2018, pre-open event - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఆటోఎక్స్‌పో-ది మోటా ర్‌ షో ప్రీ ఓపెన్‌ ఈవెంట్‌ అట్టహాసంగా ప్రారంభమైంది.  ఫిబ్రవరి 9-14వ తేదీవరకు జరిగే  14వ ఆటో ఎక్స్‌పోలో నేడు(బుధవారం), రేపు   మీడియాకు, కంపెనీలకు   ప్రత్యక షో నిర్వహిస్తున్నారు.  గ్రేటర్‌ నోయిడా వేదికగా  ఈ ఎక్స్‌పో  ప్రారంభం కానున్న సందర్భంగా పలు  కంపెనీల  వాహనాల ప్రదర్శన సందడి చేసింది.  ముఖ్యంగా మోస్ట్‌ ఎవైటెడ్‌  ఆటో  ఎక్స్‌ పో హ్యుందాయ్‌, మారుతిసుజుకి, హీరో  మోటో కార్ప్‌, అలాగే ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్స్‌ ఏప్రిలియా,  పియాజ్జియో , కంపెనీలు త​మ ప్రొడక్ట్స్‌తో సందడి చేశాయి. ఇంకా  ఫోక్స్‌ వ్యాగన్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సహా  బజాజ్‌ ఆటో, నిస్సాన్‌  ఇండియా కంపనీలు తమ సరికొత్త  వాహనాలతో హల్‌చల్‌ చేసేందుకు  రడీ అయిపోయాయి.

ఈ సందర్భంగా  భారతీయ మార్కెట్లో 2020 నాటికి ఒక ఎలక్ట్రిక్ వాహనంతో సహా తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటించింది.



(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement