ముగిసిన ఆటో ఎక్స్‌పో 

Auto Expo 2018 comes to an end after 100 launches and 6 lakh - Sakshi

ఆరు లక్షల మందికి పైగా సందర్శకులు 

గ్రేటర్‌ నోయిడా: ఆరు రోజులపాటు అట్టహాసంగా సాగిన 14వ ఆటో ఎక్స్‌పో బుధవారం ముగిసింది. ఇందులో 22 కొత్త వాహనాలు, 81 ఉత్పత్తులను ఆవిష్కరించారు. 18 కాన్సెప్ట్‌ వాహనాలను ప్రదర్శించారు. 6 లక్షల పైగా సందర్శకులు ఆటో ఎక్స్‌పోను సందర్శించారు. ఆటోమోటివ్‌ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైబ్రీడ్స్, పర్యావరణ అనుకూల టెక్నాలజీకి పెద్ద పీట వేశాయి.

మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రాతో పాటు మెర్సిడెస్‌ బెంజ్, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల సంస్థలు తమ భవిష్యత్‌ మోడల్స్‌ను ప్రదర్శించాయి. అయితే, ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్, నిస్సాన్, ఫోర్డ్‌ వంటి విదేశీ సంస్థలతో పాటు దేశీ దిగ్గజం బజాజ్‌ ఆటో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ దీనికి దూరంగా ఉన్నాయి. గత ఎక్స్‌పోలకు భిన్నంగా ఈసారి అదనంగా మరో రోజు పొడిగించడంపై అటు సందర్శకులు, ఇటు తయారీ సంస్థల నుంచి మ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top