‘బి’ స్కూల్‌ విద్యార్థులకు కొలువులేవీ? | Asocham report on business school students | Sakshi
Sakshi News home page

‘బి’ స్కూల్‌ విద్యార్థులకు కొలువులేవీ?

Dec 12 2017 1:34 AM | Updated on Dec 12 2017 1:34 AM

Asocham report on business school students - Sakshi

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాల కారణంగా బి–కేటగిరీకి చెందిన బిజినెస్‌ స్కూల్స్‌ విద్యార్థులకు కొలువులు దొరకడం కష్టంగా మారుతోంది. కేవలం 20 శాతం విద్యార్థులకే ఉద్యోగాలు లభిస్తున్నాయి. పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డీమోనిటైజేషన్, వ్యాపార సెంటిమెంట్‌ అంతంతమాత్రంగా ఉండటం, కొత్త ప్రాజెక్టులు నిల్చిపోవడం మొదలైనవి ఇందుకు కారణంగా ఉంటున్నాయని అసోచామ్‌ నివేదికలో పేర్కొంది.

క్యాంపస్‌ నియామకాలు గతేడాది కన్నా ఈ ఏడాది మరింత భారీగా క్షీణించిందని వివరించింది. ఇక ఈ విభాగం బిజినెస్‌ స్కూల్స్, ఇంజినీరింగ్‌ కాలేజీల విద్యార్థులకు ఆఫర్‌ చేసే ప్యాకేజీలు కూడా గతేడాదితో పోలిస్తే 40–45 శాతం తక్కువగా ఉంటున్నాయని వివరించింది. లక్షలు పోసి మూడు–నాలుగేళ్ల పాటు బిజినెస్‌ కోర్సులు చేయాలంటే చాలా మంది విద్యార్థులు, చదివించేందుకు తల్లిదండ్రులు పునరాలోచిస్తున్నారని అసోచాం ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (ఏఈసీ) పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement