యాప్ కీ కహానీ...
మీరు మీ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం చక్కటి యాప్ గురించి అన్వేషిస్తున్నారా? అయితే మీ అన్వేషణను ఇక ఆపండి. ‘వెల్త్‌ప్యాక్’ అనే యాప్‌ను వినియోగించి చూడండి.
వెల్త్‌ప్యాక్
మీరు మీ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం చక్కటి యాప్ గురించి అన్వేషిస్తున్నారా? అయితే మీ అన్వేషణను ఇక ఆపండి. ‘వెల్త్‌ప్యాక్’ అనే యాప్‌ను వినియోగించి చూడండి. ఈ యాప్ చాలా సింపుల్‌గా, చాలా ప్రత్యేకతలతో మీ అవసరాలకు అనువుగా రూపొందింది. వెల్త్‌ప్యాక్ యాప్ సాయంతో మీ ఆదాయ, వ్యయాలతో కూడిన బడ్జెట్ నిర్వహణ సులభతరం అవుతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశీ ప్రముఖ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ ‘ఎడి ల్‌విస్’ ఈ యాప్‌ను రూపొందించింది.
ప్రత్యేకతలు
♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్.
♦ బ్యాంక్, క్రెడిట్ కార్డులు, వాలెట్ల ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఒకే చోటు చూసుకోవచ్చు.
♦ యాప్.. డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వంటి తదితర మార్గాల్లో నిర్వహించిన ఆర్థిక లావాదేవీలను (మన ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌ల సాయం తో) ఆటోమెటిక్‌గా ట్రాక్ చేస్తుంది.
♦ మన వ్యయాలను క్యాటగరైజ్ చేసి దేనిపై ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తుంది. మన లావాదేవీలను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూడొచ్చు.
♦ బిల్లులను, రుణాలను సరైన సమయంలో చెల్లించడానికి వీలుగా అలర్ట్‌లను సెట్ చేసుకోవచ్చు.
♦ సమాచార భద్రతకు యాప్ బృందం హామీనిస్తోంది.


